Telangana

అది కేసీఆర్‌ అల్లిన కట్టుకథ

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సీఎం కేసీఆర్‌ అల్లిన కట్టుకథ అని బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. ఈ కుట్రలో భాగస్వామ్యం కావొద్దని పోలీసులకు సూచించారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఈ కథను అల్లి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్‌ ప్లాన్‌ చేసినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.