InternationalNews Alert

ఆసియా కప్‌లో బంగ్లాకు షాకిచ్చిన థాయ్‌లాండ్

మహిళల ఆసియా కప్ 2022లో బంగ్లాదేశ్ అనుకోకుండా టోర్నీ నుంచి వైదొలిగింది. ప్రకృతి సహకరించకపోవడంతో బంగ్లా ఆశలు నిరాశలయ్యాయి. ఈరోజు సెల్హెట్ వేదికగా బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానితో ఈ రెండు దేశాలకు చెరొక పాయింట్ లభించాయి. మొత్తంగా 5 పాయింట్లు మాత్రమే సాధించిన బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉండిపోయింది. దీనితో పాకిస్తాన్‌పై గెలిచిన థాయ్‌లాండ్ ఆరు పాయింట్లతో సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. అక్టోబరు 13న సెమీ ఫైనల్స్, 15న మహిళల ఆసియా కప్ ఫైనల్స్ జరగబోతున్నాయి. ఈ మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. టాప్ 4లో వరుసగా భారత్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లు ఉన్నాయి. ఈ జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి.