Home Page SliderTelangana

తెలంగాణాలో టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణాలో టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఫలితాలు విడుదలయ్యాయి. కాగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షలకు మొత్తం 2,36,487 మంది హాజరయినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణాలో నిర్వహించే డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉన్న విషయం తెలిసిందే.