BusinessHome Page SliderNationalNews Alert

భారత్‌లో టెస్లా సక్సెస్ కాకపోవచ్చు..సజ్జన్ జిందాల్

ఎలాన్ మస్క్‌కు సంబంధించిన టెస్లా కంపెనీ భారత్‌లో ప్రవేశించబోతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ కంపెనీ ఇక్కడ సక్సెస్ కావడం కష్టమని జేఎస్‌డబ్లూ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ వ్యాఖ్యానించారు. టాటా కంపెనీ కార్లు, మహీంద్రా కంపెనీ కార్లు, ఎస్వీయూలు దూసుకుపోతున్న భారత మార్కెట్లో ఖరీదైన టెస్లా కారు విజయం సాధించలేదని అభిప్రాయపడ్డారు. ఇక్కడ భారతీయుల కోసం టాటా, మహీంద్రాలు చేసిన పనులు మస్క్ చేయలేరు. ఆయన ట్రంప్ నీడలో అమెరికాలో ఏమైనా చేయవచ్చు. అంటూ విశ్లేషణ చేశారు. చైనా కంపెనీ చైనా కంపెనీ ఎంజీ మోటార్‌తో జేవీ ఉంది. క్వాలిటీతో పాటు భారత మార్కెట్లో ధర కూడా చాలా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.