Home Page SliderInternational

త్వరలో భారత్‌లో టెస్లా విద్యుత్ కార్లు

త్వరలోనే భారత్‌లోకి టెస్లా కార్ల తయారీ యూనిట్ రాబోతోంది. బ్యాటరీ విద్యుత్‌తో నడిచే పర్యావరణ హితమైన కార్లను 20 లక్షల రూపాయల నుండి విక్రయించాలని టెస్లా భావిస్తోంది. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని టెస్టా అధినేత ఎలాన్‌మస్క్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో టెస్లా కంపెనీ త్వరలోనే భారత్‌లో పెట్టుబడులకు ముందుకు వస్తోందని ప్రకటించారు మస్క్. ఈ ఒప్పందంలో భాగంగానే భారత్‌లో ఏటా ఐదు లక్షల విద్యుత్ వాహనాలు తయారీ సామర్థ్యం గల ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది టెస్లా. ఆసియా దేశాలకు భారత్ నుండే వాహనాలను కూడా ఎగుమతి చేయాలని టెస్లా భావిస్తోందిట. గతంలోనే భారత్ మార్కెట్‌పై కన్నేసిన టెస్లా ఇక్కడ దిగుమతి వాహనాలపై ట్యాక్స్‌లు ఎక్కువగా ఉండడంతో వెనుకడుగు వేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ తయారీ యూనిట్ నిర్మాణానికి ముందుకు వస్తోంది.