Andhra Pradeshcrimeindia-pak war

టిఫిన్ బాక్స్‌ల్లో బాంబులకు ఉగ్ర ప్రణాళికలు

ఏపీలోని విజయనగరంలో ఉగ్రమూలాలు గుర్తించిన పోలీసులు సిరాజ్, సమీర్ అనే వ్యక్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌ఐఏ అధికారులు విజయనగరంలో పోలీసులతో కూడా మాట్లాడారు. ఈ కేసులో వీరి రిమాండ్ రిపోర్టులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆరుగురు వ్యక్తులతో ఇన్‌స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. దీనిలో వీరిద్దరితో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీరి ముఠా 3 రోజులు హైదరాబాద్‌లో గడిపారు. అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. బాంబులు తయారు చేయాలంటూ వీరికి సౌదీలోని ఐసీస్ హ్యాండ్లర్‌ నుండి ఆదేశాలు వచ్చాయి. ఇద్దరు బాంబులు తయారు చేయాలని, నలుగురు బాంబులు పెట్టడానికి టార్గెట్లు గుర్తించాలని, వాటిని టిఫిన్ బాక్సుల్లో పెట్టి పేలుడు జరిగేలా చూడాలని ఆదేశాలు వచ్చాయి. అమెజాన్ యాప్‌లో ఇప్పటికే టిఫిన్ బాక్స్‌లు, వైర్లు, రిమోట్‌లు సిరాజ్ ఆర్డర్ చేశారు. హైదరాబాద్‌లో సమీర్‌ని, విజయనగరంలో సిరాజ్‌ని అరెస్టు చేయగా, వీరిద్దరికీ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది విజయనగరం కోర్టు.