Home Page SliderInternational

మాస్కోలో ఉగ్రవాదుల దాడి.. 60 మంది మృతి

రష్యా రాజధాని మాస్కోలో ఓ కన్సర్ట్ హాలులో దుండగులు కాల్పులు  జరిపారు. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాలులోకి ప్రవేశించిన పలువురు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 60 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ధ్రువీకరించింది. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఫిక్‌నిక్‌ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. తొలుత భవనంలోకి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరిపి బీభత్స వాతావరణ సృష్టించారు. సంగీత కార్యక్రమం అయిపోవడంతో బయటకు వెళుతున్నసమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. గాయపడిన వారి కోసం భారీగా అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. సహాయ కార్యక్రమాల్లో పోలీసులు పాల్గొన్నారు.