శంషాబాద్ లో ఉద్రిక్తత..
శంషాబాద్ లోని ఎయిర్ పోర్టు కాలనీ హనుమాన్ మందిరం వద్ద నవగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇవాళ పొద్దున్న ఆలయానికి వచ్చిన ఆయప్ప భక్తులు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విగ్రహాల ధ్వంసంపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెంపుల్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

