పాక్‌లో ఉద్రిక్తత..10 వేల మంది అరెస్ట్
పాకిస్తాన్‌లో పీటీఐ పార్టీ మద్దతుదారులు చేపడుతున్న ఆందోళనల కారణంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుండి విడుదల చేయాలంటూ వారు తీవ్ర నిరసనలు చేపట్టారు. దీనితో పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. పలువురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. దీనితో పది వేల మంది మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు. పెషావర్, ఖైబర్ ఫకున్ ఖ్వా ప్రాంతాలలో మిలిటెంట్లు దాడులు చేసే అవకాశం ఉందని పాక్‌లోని అమెరికా పౌరులను ఆ దేశ అడ్వైజరీ కమిటీ హెచ్చరించింది.
BREAKING NEWS: అయ్యప్పభక్తునికి బ్రీత్ ఎనలైజర్

