కర్ణాటక అసెంబ్లీలో ఉద్రిక్తత..హనీట్రాప్ ఆరోపణలు
కర్ణాటక అసెంబ్లీని హనీ ట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. ఈ వ్యవహారంపై శాసనసభలో చర్చ జరగాల్సిందేనని బీజేపీ పట్టుపట్టగా, ప్రభుత్వం, స్పీకర్ పట్టించుకోకుండా ముస్లిం కోటా బిల్లును స్పీకర్ పాస్ చేశారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లును చించి స్పీకర్ ముఖంపై విసిరి కొట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేయగా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు ప్రారంభం అయితే హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ సభ్యులు కూడా బీజేపీ ఎమ్మెల్యేలపై కోపంతో బుక్స్, పేపర్లు వారిపై విసరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ గందరగోళం నడుమ సభను స్పీకర్ కాసేపు వాయిదా వేశారు.
