హైదరాబాద్‌లో టెన్షన్..హై అలర్ట్
పహల్గాం ఉగ్రదాడి, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లో టెన్షన్ నెలకొంది. దేశంలోని ఉగ్రవాద ప్రభావిత నగరాలలో హైదరాబాద్ కూడా ఉండడంతో నిఘా వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి. సున్నిత ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పైగా రెండు అత్యున్నత కీలక ఘట్టాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నెల 25,26 తేదీలలో భారత్ సమ్మిట్, మే నెలలో 7వ తేదీ నుండి 31 వరకూ మిస్ వరల్డ్-2025 పోటీలు జరగనున్నాయి. వీటికి జాతీయ, అంతర్జాతీయ సెలబ్రెటీలు ప్రముఖులు రానున్నారు. వివిధ హోటళ్లలో బస చేయనున్నారు. దీనితో ఇక్కడ పెద్ద సంఖ్యలో అదనపు బలాలు మొహరిస్తున్నాయి.

