హర్యానా సరిహద్దులలో ఉద్రిక్తత..
హర్యానా సరిహద్దుల్లో శంభు ప్రాతం వద్ద రైతులు ఛలో ఢిల్లీ పేరుతో నిరసన చేపట్టారు. వారి పంటలకు కనీస మద్దతు ధరతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. దీనితో సరిహద్దుల వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ నిరసనల కారణంగా కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఢిల్లీ సరిహద్దులలో రైతులు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో బారికేడ్లతో భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానాలోని కొన్ని ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ వద్ద కూడా ఢిల్లీ ఛలో ఆందోళన చేస్తున్న రైతులను అడ్డగించారు పోలీసులు. సరిహద్దులలో కేంద్ర బలగాలను మోహరించారు. మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు.

