మాజీమంత్రి ఇంటిదగ్గర టెన్షన్
తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద టెన్షన్ చోటు చేసుకుంది. భారీగా పోలీసులు మెహరించారు. బుగ్గ మఠం భూములు ఆక్రమించారన్న ఆరోపణలతో ఆయనకు ఏప్రిల్ 11న పెద్దిరెడ్డికి దేవాదాయశాఖ నోటీసులు ఇచ్చారు. పెద్దిరెడ్డి లీజుకు ఇచ్చిన భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బుగ్గ మఠానికి చెందిన 14.49 ఎకరాల భూములపై సర్వే చేసిన అధికారులు 3.88 ఎకరాలు ఆక్రమించినట్టు నోటీసులు ఇచ్చారు. మఠం అధికారులను అడ్డుకున్నారు పెద్దిరెడ్డి అనుచరులు. అయితే ఈ భూములతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. వాటిని తన సోదరుడు ద్వారకానాథరెడ్డి కొనుగోలు చేశారని చెప్పారు. ఈ విషయంలో పెద్దిరెడ్డితో పాటు మరో నలుగురికి నోటీసులు ఇచ్చారు.

