పదేళ్ల వయసుంటే చాలు..
పదేళ్లు దాటితే చాలు ఇకపై పిల్లలే వారి బ్యాంక్ ఖాతాలను సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చంటూ రిజర్వ్ బ్యాంక్ తాజాగా అనుమతినిచ్చింది. పదేళ్లు దాటిన పిల్లలు వారికి సంబంధించిన సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను తెరిచి, లావాదేవీలు సాగించుకోవడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో మైనర్లు బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నా కూడా గార్డియన్ల ద్వారానే ఖాతాలను నిర్వహించాలి. కానీ తాజా ఆదేశాల ప్రకారం వారు తమ సంతకం, ఇతర వివరాలు మళ్లీ ఇస్తే, వారికి ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డ్, చెక్‌బుక్ సదుపాయాలను బ్యాంకులు కల్పిస్తాయి. జూలై 1వ తేదీ నుండి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.