పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన రాష్ట్రంలో ఫ్యూడల్ సమాజం ఏర్పడింది..డిప్యూటీ సీఎం
ఆర్థిక అసమానతలతో కూడిన ఫ్యూడల్ సమాజాన్ని తన పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణలో తీసుకొచ్చిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాం. ప్రజాప్రభుత్వంలో పార్టీలకతీతంగా సూచనలు స్వీకరిస్తాం. బీఆర్‌ఎస్ పార్టీ పాలనలో సంపద, సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. ప్రజల కోసం మాత్రమే అధికారులు పనిచేయాలి. ప్రజలు వారి సమస్యలను నేరుగా ఎమ్మెల్యే కార్యాలయంలో చెప్పుకోవచ్చు. రాష్ట్రఆర్థిక స్థితి అప్పుల కుప్పగా మారింది. అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

