కొడాలి నాని ఇంటిపై దాడికి తెలుగు మహిళల యత్నం
గుడివాడలోని వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ మహిళా కార్యకర్తలు ప్రయత్నించారు. కొడాలి నాని ఇంటికి వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. మహిళలను కించపరిచేలా కొడాలినాని మాట్లాడారని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలుగు మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు టీడీపీ మహిళా నేతలను అదుపులోకి తీసుకున్నారు.