పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి
పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా. రేపు కల్లితండాకు వీర మురళీ నాయక్ పార్థివదేహం తరలించనున్నారు. మురళీ నాయక్ మరణవార్త విని కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అతని ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా అనంతరం రూ.5లక్షల చెక్కును మంత్రి సవిత అందజేశారు.

