జాతీయపురస్కారానికి ఎంపికైన తెలుగు ఐఏఎస్ అధికారి
తెలుగు ఐఏఎస్ అధికారి వీఆర్ కృష్ణతేజ జాతీయ పురస్కారం అందుకోబోతున్నారు. జాతీయ బాలల రక్షణ కమిషన్‌కు సంబంధించిన ఈ పురస్కారానికి ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న ఆయనను ఎంపిక చేశారు. ఆయన ఎంతో కృషి చేసి బాలల హక్కుల రక్షణలో త్రిస్సూర్‌ను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారు. దీనితో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

