Home Page SliderNational

“ది కేరళ స్టోరీ” ని ఎందుకు బ్యాన్ చేశారో చెప్పండి: సుప్రీం

“ది కేరళ స్టోరీ” ఇప్పుడు భారతదేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన సినిమా. కాగా ఈ సినిమాని దేశంలోని పలు రాష్ట్రాలు స్వాగతించి.. పన్ను మినహాయింపు కూడా ప్రకటించాయి. అయితే మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ సినిమాపై నిషేదాన్ని విధించిన విషయం తెలిసిందే. వీటిలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ సినిమా వివాదాస్పదంగా ఉంటంటూ తమ రాష్ట్రంలో నిషేదించింది. దీంతో “ది కేరళ స్టోరీ” మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎందుకు నిషేదించారో వివరణ ఇవ్వాలని కోరుతూ.. పశ్చిమ బెంగాల్  ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ విధంగా వివాదాల నడుమ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కాగా ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ.150 కోట్లు వసూళ్లు రాబట్టింది. హీరోయిన్ ఆదా శర్మ ప్రధాన పాత్రలో,సుదీప్తోసేన్ దర్శకత్వంలో  ది కేరళ స్టోరీ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఆదా శర్మ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.