Breaking NewscrimeHome Page SliderNews

తెలంగాణ‌ మ‌హిళ‌ల‌కు రూ.4వేల కోట్ల బాకీ ఉన్నారు

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల‌కు రూ.4వేల కోట్ల‌కు పైగా బ‌కాయిలు ఉన్నాడ‌ని,ఆ అప్పంతా ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాల‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. చేవెళ్ల రైతు మహా ధర్నాలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన ఏడాదిలోనే దాదాపు 5 లక్షల పెళ్ళిళ్ళు అయ్యాయ‌ని, ఒక్కొక్క‌రికి తులం బంగారం ,నెల‌కు రూ.2500ల చొప్పున ఆయ‌న బాకీ ఉన్నాడ‌ని, మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో మ‌హిళ‌కు రూ.80లు చొప్పున దాదాపు రూ.4వేల కోట్ల మేర అప్పుడున్నాడ‌ని లెక్క‌ల‌తో తేల్చి చెప్పాడు. రేవంత్ రెడ్డికి తులం బంగారం దొరకడం లేదా? అని కేటిఆర్ సూటిగా ప్ర‌శ్నించారు.ఆడ‌బిడ్డ‌ల‌కు ఇచ్చిన హ‌మీలు అమ‌లు చేయ‌లేనోడికి కుర్చీలో కూర్చుని పాలించే అధికారం లేద‌ని, త‌క్ష‌ణ‌మే సీఎం రాజీనామా చేయాల‌ని కేటిఆర్ డిమాండ్ చేశారు.