Home Page SliderNews

తెలంగాణ తల వంచదు.. ఎమ్మెల్సీ కవిత పూర్తి స్టేట్మెంట్

మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. రాజకీయ భాగస్వామ్యంలో మ‌హిళ‌ల వాటా కోసం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్టాలి. భరత్ జాగృతితోపాటు, దేశం నలుమూలల నుండి ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలు… మార్చి 10న జంతర్ మంతర్ వద్ద ఒక రోజు శాంతియుత నిరాహార దీక్షకు దిగుతాం. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టి, ఆమోదించాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నాం.

ఈ ఘటన నేపథ్యంలో… మార్చి 9న విచారణకు రావాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులిచ్చింది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తాను. అయితే ధర్నాతోపాటుగా, ముందస్తు అపాయింట్‌మెంట్‌ల కారణంగా… ఈడీ విచారణకు హాజరు విషయంలో తేదీ విషయంలో న్యాయపరమైన అభిప్రాయాలను కోరతాను.

కేంద్రంలోని అధికార పార్టీ తెలుసుకోవాలి. ఇలాంచి చర్యలకు భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కి వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న బెదిరింపు చర్యలు తమ పోరాట మార్గాన్ని అడ్డుకోలేవు. కేసీఆర్ నాయకత్వంలో పోరాటం కొనసాగుతుంది. బీజేపీ వైఫల్యాలను బహిర్గతం చేయడానికి, భారతదేశానికి మంచి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఢిల్లీలో అధికారదాహంతో ఉన్నవారికే ఒక్కటే చెబుతున్నా.. తెలంగాణ తలవంచదు. ప్రజల హక్కుల కోసం నిర్భయంగా, ఉధృతంగా పోరాడుతాం.

జై హింద్!
జై తెలంగాణ!
కవిత కల్వకుంట్ల