Home Page SliderTelangana

మళ్లీ బీఆర్ఎస్ వస్తే తెలంగాణ అధోగతి: కిషన్ రెడ్డి

స్వతంత్ర సమరయోధుల ఆకాంక్షలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 2047 నాటికి పేదరిక నిర్మూలన జరగాలని మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుందని చెప్పారు. బుజ్జగింపు, కుటుంబ, అవినీతి, నియంతృత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలని దేశంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. మరోసారి కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వస్తే, తెలంగాణ అధోగతి పాలవుతుందన్నారు. భూములు కనిపిస్తే అక్రమిస్తున్నారు, వేలం వేస్తున్నారన్న కిషన్ రెడ్డి… ధరణి పేరుతో రైతుల పొట్ట గొట్టారన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయ్యిందన్నారు. కేసీఆర్ కుటుంబం 30 శాతం వాటాలు తీసుకొని పాలన సాగిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రశ్నించే వారిని నిర్భందిస్తోందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయడం రద్దు చేయడంతో యువత గోస పడుతున్నారన్నారు. విశ్వవిద్యాలయాలు కళావిహీనంగా మారాయన్న కిషన్ రెడ్డి… కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందేనన్నారు. కాంగ్రెస్ పాలకులు కమిషన్లు తీసుకుంటే.. ప్రస్తుత బీఆర్ఎస్ పాలకులు వాటాలు తీసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కి వేసినట్లేనని ప్రజలు గమనించాలన్నారు.