Home Page SliderTelangana

రంజాన్ మాసంలో ముస్లింలకు తెలంగాణా సర్కార్ గుడ్‌న్యూస్

ఈ నెల 23 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ఊరట కల్పించింది. తమ విధుల నుంచి ఉద్యోగులు ఓ గంట ముందుగా వెళ్లేందుకు  వెసులుబాటు కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వంలోని వివిధ శాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగులు ,ఉపాధ్యాయులు, ఒప్పంద,పొరుగు సేవల ఉద్యోగులు మార్చి 23 వ తేది నుంచి ఏప్రిల్ 23 వ తేది వరకు సాయంత్రం 4 గంటలకే ఇంటికి వెళ్లపోవచ్చని పేర్కొంది.