Home Page SliderNews AlertTelanganatelangana,

ఇకపై సీక్రెట్ కెమెరాలకు చెక్..

బాలికలు, మహిళలు సీక్రెట్ కెమెరాల బారిన పడకుండా ఉండడానికి తెలంగాణ  పోలీసులు కొత్త పరికరాన్ని తీసుకువస్తున్నారు.  ‘యాంటీ రెడ్ ఐ టీమ్‌’ సహాయంతో స్టార్ హోటల్స్, లాడ్జీలు, షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్, పబ్స్, హాస్టల్స్, హాస్పటల్స్, స్కూల్స్, కాలేజీలు వంటి చోట్ల సీక్రెట్ కెమెరాలను కనిపెట్టడమే వీరి పని. ఎక్కడ సీక్రెట్ కెమెరాలనున్నా ఈ టీమ్ వాటిని గుర్తించి, కేసులు నమోదు చేస్తుంది. దీనికోసం 2 వేల మంది ‘నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్)’ విద్యార్థినిలకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. వీరు కూడా షీ టీమ్స్‌తో కలిసి ఈ ఆపరేషన్‌లో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా బగ్ డిటెక్టర్లను ఉపయోగించి తనిఖీలు చేపడతారు.