ధరల పెరుగుదలలో అధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ: నిర్మలా సీతారామన్
హైదరాబాద్: తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా భ్రష్టు పట్టించిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని విపక్ష నేతలు సైతం కొనియాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్‌లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరఫున ఆమె ప్రచారం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. దేశంలో అత్యధిక ధరల పెరుగుదలలో ముందున్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మటుకు ధరలను అదుపుచేద్దామన్న ఆలోచనే లేకుండా, అదుపు చేయుటకు ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదు. బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగా పూర్తిచేయలేదు.