రేవంత్ రెడ్డి సర్కారుకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
బీసీ కుల గణన చేయ్యాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ బెంచ్ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ తరపు నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. మూడు నెలల్లో బీసీ కుల గణన చెయ్యాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కుల గణన చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వా్నికి హైకోర్టు తేల్చి చెప్పింది.


 
							 
							