Home Page SliderNews AlertTelangana

ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి.  ఫిబ్రవరి 3 తేదీ నుండి మధ్యాహ్నం 12.10 గంటల నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజే అసెంబ్లీ, మండలిలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టే అవకాశముంది.అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2023-24 ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ 2.85 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం.