హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక కంపెనీ హెచ్‌సీఎల్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తాజాగా హైటెక్ సిటీలో కొత్త టెక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబులు దావోస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ జరుగుతున్న సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం వారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఒక కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేసి, 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీ ద్వారా లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ వంటి సేవలను ఈ సంస్థ ద్వారా విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.