NationalNews Alert

ఆసియా కప్ ఫైనల్స్‌లో టీమిండియా మహిళా జట్టు

గురువారం థాయ్‌ల్యాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ 74 పరుగులతో ఘన విజయం సాధించి , మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలోకి అడుగుపెట్టింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌ల్యాండ్ వుమెన్స్ భారత బౌలర్ల దాటికి నిర్ణయించిన 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 74 పరుగులే చేసింది. థాయ్‌ల్యాండ్ బ్యాటర్లలో నరుమోల్ చవాయి 21 , నట్టాయి బుచాతమ్ 21 పరుగులు తీశారు. టీమిండియా బౌలర్లు దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా..రాజేశ్వరి గైక్వాడ్ రెండు , షఫాలీ వర్మ , స్నేహ రాణా , రేణుకా సింగ్‌లు తలా ఒక వికెట్ తీశారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వుమెన్స్ నిర్ణయించిన 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. దీనిలో షఫాలీ వర్మ 42 పరుగులు తీసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక శ్రీలంక , పాకిస్తాన్ వుమెన్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో  2వ సెమీఫైనల్ విజేతతో టీమిండియా ఫైనల్స్‌లో తలపడనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది.