Home Page SliderInternationalSports

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో టీమిండియా స్టార్స్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. వీరిలో టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రా 908 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. రెండవ స్థానంలో అసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 841 రేటింగ్స్‌తో ఉన్నారు. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 847 రేటింగ్స్‌తో 4వ స్థానంలో ఉన్నారు.    అసీస్ పేసర్ స్కాట్ బొలాండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించి ఏకంగా 29 స్థానాలు ఎగబాకి తొమ్మిదే స్థానంలో ఉన్నారు. ఇదే స్థానంలో 745 రేటింగ్స్‌తో రవీంద్ర జడేజా కూడా ఉన్నారు. రిషబ్ పంత్ 739 రేటింగ్స్‌తో టాప్ 10లోకి దూసుకొచ్చారు.