Home Page SliderNationalNews Alert

ఏప్రిల్‌ నెలలో 25 కోట్ల మామిడి పండ్లకు ఆర్డర్లు

Share with

పండ్లలో రారాజుగా మామిడి పండును పిలుస్తారు. ఇది వేసవిలో ఎక్కువగా దొరికే ఫ్రూట్‌. పరిమిత కాలమే లభ్యమయ్యే పండు మామిడి. వేసవికాలం నుంచి మరల వేసవి వరకు ఎదురుచూసేది మామిడి పండు కోసమే. మన దేశంలో మామిడి దిగుబడి దాదాపుగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు వస్తుంటుంది. మామిడి పండ్లను ప్రజలు ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక్క ఏప్రిల్‌ నెలలో 25 కోట్ల విలువ చేసే మామిడి పండ్లకు జెప్టో ప్లాట్‌ ఫామ్‌లో కస్టమర్ల నుంచి ఆర్డర్లు వచ్చాయి.  సగటున రోజువారీగా రూ. 60 లక్షల విలువ చేసే ఆర్డర్లను జెప్టో స్వీకరించింది. ఏప్రిల్‌ కంటే మే నెలలో మరింత అధికంగా ఆర్డర్లు వస్తాయని జెప్టో అంచనా వేస్తోంది. పచ్చి మామిడి కాయలకు కూడా డిమాండ్‌ ఎక్కువే ఉంది. ఏప్రిల్‌ నెలలో 25 లక్షల విలువ చేసే మామిడి కాయలకు జెప్టోలో ఆర్డర్లు వచ్చాయి.

మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో పండే ఆల్ఫాన్సో రకానికే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. పండ్ల విక్రయాల్లో 30 శాతం ఆల్ఫాన్సోవే ఉన్నాయి. ముంబై, బెంగళూరు, ఢిల్లీ వాసులు వీటి కోసం ఎక్కువగా ఆర్డర్‌ ఇచ్చారు. ఆ తర్వాత బంగినపల్లి రెండో స్థానంలో ఉంది. ఈ మామిడి పండ్లకు 25 శాతం విక్రయాలు ఉన్నాయి. దక్షిణాది వాసులు ఎక్కువగా విక్రయిస్తున్నారు. జెప్టో సంస్థ దేశ వ్యాప్తంగా 1000 మంది మామిడి రైతులతో సరఫరా ఒప్పందాలు చేసుకుంది.