Home Page SliderNational

టీమిండియా ఛాంపియన్స్ విత్ పీఎం మోదీ

టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అదరగొట్టి పొట్టి కప్పును దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ రోజు స్వదేశానికి చేరుకున్నారు. కాగా ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న టీమిండియాకు క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి టీమిండియా క్రికెటర్లు మౌర్య హోటల్‌కు చేరుకుని అక్కడ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అనంతరం టీమిండియా క్రికెటర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ క్రమంలో T20 వరల్డ్ కప్‌ను సాధించినందుకు ప్రధాని మోదీ క్రికెటర్లను అభినందించారు. అయితే టీమిండియా క్రికెటర్లు మరి కాసేపట్లో ముంబైకి బయలు దేరనున్నారు. కాగా వారు ఇవాళ సాయంత్రం ముంబయిలో నిర్వహించబోయే రోడ్ షోలో పాల్గొననున్నారు.