తరగతి గదిలో విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్..
మంచిచెడులు నేర్పి విద్యార్థులను తీర్చి దిద్దవలసిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి విద్యార్థులకు దగ్గరుండి తరగతి గదిలో మద్యం పోసి, తాగించిన ఘటన సంచలనం కలిగించింది. మధ్య ప్రదేశ్‌లోని కఠ్‌నీ జిల్లాలో ఖిర్వానీ అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ అనే ఉపాధ్యాయుడు శుక్రవారం కొందరు విద్యార్థులకు మద్యం తాగిస్తుండగా, కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనితో ఈ సంగతి కలెక్టర్ వరకూ చేరింది. ఆ టీచర్‌పై చర్యలకు ఆదేశించి, అతడిని సస్పెండ్ చేశారు.

