మీ అబ్బాయిలకు కూడా ఇది నేర్పండి?
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఉదంతం దేశాన్ని కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఒక తెలుగు సినిమాలో ఆల్‌రెడీ చెప్పడం జరిగింది, అలాగే మీ కూతురికి నేర్పిస్తున్నారు, దాంతోబాటు మీ కుమారుడికి కూడా దాని గురించి తెలిసేలా చెప్పండి’ అని రాసి ఉన్న ప్లకార్డులు ఆలోచింపజేస్తున్నాయి. పరాయి అమ్మాయిల పట్ల ఎలా వ్యవహరించాలనే ఇంగిత జ్ఞానం ఉన్నప్పుడే ఇలాంటి దారుణాలు కాస్తయినా తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి మీ సమాధానం ఏమిటి?