టీడీపీది “మాయా” ఫెస్టో : విజయసాయి రెడ్డి
ఏపీలో టీడీపీ మ్యానిఫెస్టో విడుదల చేసినప్పటి నుంచి వైసీపీ నేతలు మ్యానిఫెస్టోపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీ చిత్తశుద్ధిలేని మ్యానిఫెస్టోని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితే లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే టీడీపీ పార్టీ సుప్రీంకోర్టు దాకా వెళ్లి గుక్కపట్టి ఏడ్చిందన్నారు. అలాంటివారు పేదలను కోటిశ్వరులుగా చేస్తామంటే ఎలా నమ్మాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చిత్తశుద్ధి లేని హామీల మాయఫెస్టోను నమ్మేదెవరు అని ఆయన ట్వీట్ చేశారు.