Andhra PradeshHome Page SliderNews Alert

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్, జగన్‌కు ఝలక్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ఏడుగురు అభ్యర్థుల్ని గెలిపించుకుంటామనుకున్న ఆ పార్టీకి ఎమ్మెల్యేలు షాకిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. టీడీపీ తరుఫున బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లు రావడంతో ఆమె విజయం సాధించారు. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఆమె గెలుపు లాంఛనమే అయినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ టీడీపీకి ఉన్న బలం 19 అయినా ఆమెకు 23 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో అనూహ్యంగా విజయం సాధించారు. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరిగింది. మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో దిగారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. క్రాస్‌ ఓటింగ్‌పై సీఎం జగన్‌ ఎన్ని చర్యలు చేపట్టినా టీడీపీ అభ్యర్థికి 23 ఓట్లు పడటంతో చర్చనీయాంశంగా మారింది. రెండు ఓట్లు క్రాస్‌ అవటంపై అటు వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు.