Telangana

మునుగోడులో బీజేపీకి టీడీపీ మద్దతు!

మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన మూడు రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉపఎన్నిక పోరు హోరాహోరీగా ఉండటంతో ప్రధాన పార్టీలు పక్షాల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మునుగోడులో బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్ధిక రాజగోపాల్ రెడ్డికి టీడీపీ పార్టీ మద్దతుఇవ్వాలని నిర్ణయించినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి .. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించడంతోనే ఆయనను రాజగోపాల్ రెడ్డి కలుస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి చంద్రబాబును కలిసిన తర్వాత బీజేపీకి మద్దతుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.