ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారీలో టీడీపీ నేతల ట్రైనింగ్
ఆఫ్రికా వెళ్లి నకిలీ మద్యం తయారీలో టీడీపీ నేతలు ట్రైనింగ్ తీసుకొచ్చారనీ, మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మంగళవారం మీడియా సమక్షంలో ఆరోపించారు .
మా హయాంలో కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే మద్యం పాలసీని కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనే నకిలీ మద్యం తయారీ ఉధృతంగా సాగుతోంది.
డబ్బు కోసం ఏ హద్దుకైనా వెళ్తున్నాడు చంద్రబాబు… ప్రజల ప్రాణాలతో,వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు అంటూ ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టడం చంద్రబాబు దురాశకు నిదర్శనం. ప్రజలకు సేవ చేసే వైద్య విద్యను కూడా వ్యాపారంగా మార్చేశాడు అని ఆయన పేర్కొన్నారు .
ఈ నెల 9వ తేదీన సీఎం వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజ్‌ను సందర్శించనున్నారని తెలిపారు. “ఆ సందర్శన సందర్భంగా ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపడతాం. ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో గవర్నర్ కు చూపిస్తాం” అని పేర్ని నాని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో అవినీతి పెరిగిపోయిందని, నకిలీ మద్యం వ్యవహారంలో సంబంధిత మంత్రికి ముడుపులు అందుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు ఈ అవినీతి పాలనను భరించలేరు. చంద్రబాబు ప్రభుత్వానికి అంతిమ గడియలు మోగాయి అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.