YCP సెటైర్‌కి TDP కౌంటర్
ఏపీలో మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని అధికార,ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శ-ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయితే తాజాగా ఏలూరులో టీడీపీ నాయకులు బహిరంగ సభ నిర్వహించారు. కాగా ఈ సభలో ఏర్పాటు చేసిన స్టేజ్ టీడీపీ నాయకులు దానిపై ఉన్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దాదాపు 10 మంది టీడీపీ నాయకులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే దీనిపై YCP పార్టీ టీడీపీ పార్టీ పని అయిపోయింది అని వ్యగ్యంగా సెటైర్ వేసింది. ఈ సెటైర్‌కు టీడీపీ పార్టీ వైసీపీకి తాజాగా కౌంటర్ ఇచ్చింది. అదేంటంటే “Daddy&Babai be like: ఏమిట్రా తమ్ముడు,మనోడి సైకో వేషాలు? నన్ను హెలికాప్టర్‌తో ల్యాండ్ చేసినప్పుడు ఇలాగే ఆనందం పొందాడు.నీకు బాత్‌రూమ్‌లో గుండెపోటు తెప్పించి ఇలాగే ఆనందం పొందాడు. మనోడికి ఒకరు బాధపడితే సంతోషించే బుద్ది ఏమిటిరా?అందుకేనేమో ఏపీ మొత్తం సైకో పోవాలి అంటుంది” అని టీడీపీ ట్వీట్ చేసింది.