Home Page SliderNational

“టిల్లు క్యూబ్‌”లో ట్యాక్సీవాలా హీరోయిన్

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన “టిల్లు”, “టిల్లు స్క్వేర్” సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో టిల్లు క్యూబ్ రూపొందించేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా ట్యాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జువాల్కర్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ప్రియాంక టిల్లు స్క్వేర్ మూవీలో ఓ చిన్న పాత్రలో కన్పించారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సివుంది. కాగా “టిల్లు”,”టిల్లు స్క్వేర్” బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో రాబోయే “టిల్లు క్యూబ్‌”పై భారీ అంచనాలు ఉన్నాయి.