Breaking NewsBusinessHome Page Sliderhome page sliderNationalNewsviral

టాటాసన్స్ లిస్టింగ్ ఇప్పట్లో లేనట్లే

టాటా గ్రూప్ సంస్థ టాటా సన్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ కు ఇంకా సందిగ్ధత తొలగిపోలేదు. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 66 శాతం ఉన్న టాటా ట్రస్ట్స్ ఈ ఐపీఓకు అనుకూలంగా లేదని సమాచారం. టాటా సన్స్ లిస్టింగ్ అయితే తమ నియంత్రణ తగ్గే అవకాశం ఉందని టాటా ట్రస్ట్ భావిస్తోందట. ఎందుకంటే టాటా సన్స్ నుండి వచ్చే డివిడెంట్లతోనే ట్రస్ట్ తమ దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరో కారణం ఏమిటంటే టాటా సన్స్ లో 18 శాతం పైన వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబం అతి పెద్ద మైనారిటీ వాటాదారుగా ఉంది. ఈ సంస్థ ఐదేళ్లుగా టాటా సన్స్ లిస్టింగ్ కోసం డిమాండ్ చేస్తోంది. ఒక వేళ లిస్టింగ్ చేస్తే ఆ కుటుబానికి ప్రాముఖ్యత లభిస్తుందనే కారణంతో కూడా టాటా ట్రస్ట్ వెనకడుగు వేస్తోంది. 2023లో ఆర్బీఐ టాటా సన్స్ ను అప్పర్ లేయర్ NBFC గా వర్గీకరించడం వల్ల ఈ అక్టోబర్ లో ఈ కంపెనీ ఐపీఓ పూర్తి చేసుకుని స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కావాల్సి ఉంటుంది. అయితే తాజాగా టాటా సన్స్ ఛైర్మన్ గా మూడోసారి కూడా నటరాజన్ చంద్రశేఖరన్ కు అవకాశమిచ్చారు. 2027 తో ఆయన పదవీకాలం ముగుస్తుండగా..మరో ఐదేళ్ల పాటు అంటే 2032 వరకూ పొడిగిస్తూ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది.