NationalNewsNews Alert

ఎయిరిండియా ఉద్యోగులకు టాటాగ్రూప్ తీపి కబురు

ఎయిరిండియా సంస్థ టాటాగ్రూప్‌లో భాగమైన సంగతి అందరకూ తెలిసిందే. తాజాగా ఎయిరిండియా ఉద్యోగులకు టాటా సంస్థ తీపికబురు చెప్పింది. కొవిడ్-19 కు ముందున్న జీతభత్యాలు సెప్టెంబర్ 1 వతేదీ నుండి పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది. జీతాలే కాకుండా అలవెన్సులు, భోజన సౌకర్యాలను కూడా సవరిస్తున్నట్లు తెలిపింది.

కరోనా మహమ్మారి కారణంగా చాలా విమానయాన సంస్థలు దివాళా తీసాయి. దానితో ఉద్యోగుల వేతనాలు, ఇతరసౌకర్యాలు పూర్తిగా తగ్గించాయి. కరోనా విజృంభణ వల్ల వివిధ దేశాలకు రాకపోకలు బాగాతగ్గాయి. ప్రయాణీకులపై ఆంక్షలు, ప్రజల ఆదాయం తగ్గిపోయిన కారణంగా విమానాల రాకపోకలు కొన్నాళ్లు ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం కొంచెం కోలుకుని కాస్త ముందునాటి స్థితికి తిరిగి వచ్చాయి. ఉద్యోగుల శాలరీలను పెంచడం సంతోషంగా ఉందని ఎయిరిండియా సంస్థ చెప్పింది.