అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం…
టాలీవుడ్ యాక్టర్ నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్, ఇతర స్పెషలిస్ట్‌లు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నామని ప్రకటనలో తెలిపారు. రాత్రి వైద్యులు తారకరత్నకు మరోసారి యాంజియోప్లాస్టీ నిర్వహించారు. 48 గంటలపాటు తారకరత్నకు ఎక్మోపై చికిత్స అందించాలని వైద్యులు సూచించారు. తాజా ఆరోగ్యపరిస్థితిపై నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.