మధ్యప్రదేశ్ పిల్లల మరణాలకు తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా? CDSCO సంచలన నివేదిక!
మధ్యప్రదేశ్‌లో జరిగిన 23 మంది చిన్నారుల మరణాల వెనుక తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) గుర్తించినట్లు NDTV వెల్లడించింది.
వివరాల ప్రకారం, విషపూరితమైన ColdRef సిరప్ తయారు చేసే ‘Sresan Pharma’ కంపెనీలో తనిఖీలు జరగలేదని, అందువల్లే ఆ ప్రమాదకరమైన సిరప్ మార్కెట్లోకి వచ్చిందని CDSCO తెలిపింది.
అంతేకాక, ఆ సంస్థలో ఆడిట్ అసలు జరగలేదని, అలాగే సెంట్రల్ డ్రగ్ పోర్టల్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేయలేదని నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఘటనతో ఔషధ నియంత్రణ వ్యవస్థపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి.