Home Page SliderNational

ఈడీ ఆఫీసుకి తమన్నా.. కీలక కేసులో విచారణ

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియాకు ఈడీ షాకిచ్చింది. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటి తమన్నాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. బిట్ కయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీల సాకుతో పలువురు పెట్టుబడిదారులను ‘హెచ్పీ జెడ్ టోకెన్’ మొబైల్ యాప్ నిర్వాహకులు మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. యాప్ నిర్వాహకుల మీద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ యాప్ ఆర్గనైజ్ చేసిన ఓ ఈవెంట్ కు తమన్నా హాజరయ్యారు. అందుకోసం డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈడీ అధికారులు ఆమెను సీక్రెట్ గా విచారించినట్లు తెలుస్తోంది.