Home Page SliderTelangana

క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త..

క్రెడిట్ కార్డులతో అలెర్ట్ గా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రెడిట్ కార్డు అప్లై పేరిట ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసం చేశారు. హైదరాబాద్ సిటీకి చెందిన 46 ఏండ్ల మహిళ ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తోంది. ఆమెకు యాక్సిస్ ఇండియా క్రెడిట్ కార్డును సైబర్ నేరగాళ్లు ఆఫర్ చేసి లింక్ పంపారు. సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా ఆమె అప్లికేషన్ లో తన వ్యక్తిగత వివరాలతో పాటు.. ఆమె వాడుతున్న కొటాక్ మహీంద్ర, SBI బ్యాంకుల క్రెడిట్ కార్డు వివరాలను అప్లోడ్ చేసింది. అనంతం ఆమె కార్డుల నుంచి ఒక లక్షా 15 వేల రూపాయలు కట్ అయ్యాయి. దీంతో మోసం జరిగిందని గుర్తించిన ఆ మహిళ.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.