బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్
ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి బిర్యానీ అంటే ఎంతో ఫేమస్. అక్కడ బిర్యానీ తింటే ఆ రుచే వేరు. కానీ తాజాగా బిర్యానీలో ట్యాబ్లెట్ రావడంతో వినియోగదారులు ఆశ్యర్యపోతున్నారు. దీన్ని బిర్యానీ అరగడం కోసం వేశారా అని కామెంట్లు చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి హోటల్‌లో గురువారం రాత్రి బిర్యానీ తింటున్న ఓ వ్యక్తి పల్లెంలో మాత్ర వచ్చింది. దానిపై వినియోగదారులు హోటల్ ప్రతినిధులను నిలదీశాడు. దీంతో సిబ్బంది ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.దీంతో ఈ వీడియో శుక్రవారంసోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న హోటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు హోటల్‌లో తనిఖీ చేశారు. గోలీ కనిపించిన పల్లెంలోని బిర్యానీని అప్పుడే చెత్త డబ్బాలో పడేసినట్లు అధికారులకు నిర్వాహకులు చెప్పారు. అయినప్పటికీ శుక్రవారం కూడా నమూనాను తీసుకుని ప్రయోగశాలకు పంపించామని బల్దియా అధికారులు తెలిపారు.
