రష్యా బ్యాంకుల్లో సిరియా వేల కోట్ల సంపద
సిరియా నుండి రష్యాకు విమానాలలో నోట్లకట్టలు కుక్కి గుట్టు చప్పుడు కాకుండా తరలి పోయేవని, ఫైనాన్షియల్ టైమ్స్ అనే పత్రిక కథనంలో బయటపడింది. 2018-19 మధ్య కాలంలో దాదాపు 100 డాలర్ల నాణాలు, 500 యూరో నోట్లకట్టలను విమానాలలో మాస్కోకు తరలించారని అసద్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. నిరంకుశ పాలకుడు అసద్ తన అక్రమ సంపాదనను కాపాడుకోవడం, సిరియా వనరులపై నియంత్రణ కోసం ఇలా చేసేవాడని ఈ కథనంలో పేర్కొన్నారు. ఈ సొమ్ముతో పాలకులు విలాసవంతమైన జీవితానికి అవసరమైన కొనుగోళ్లను చేసేవారని, జేపీ మోర్గాన్ సంస్థలో పనిచేసే ఉద్యోగి దీనికి సహాయం చేసినట్లు తెలిపింది. రష్యాలోని ఫైనాన్షియల్ కార్పొరేషన్ బ్యాంక్, టీఎస్‌ఎంఆర్ బ్యాంకులు వీరికి సహాయం చేశాయి. సిరియా సెంట్రల్ బ్యాంకులు చెందిన విమానాలు తరచూ మాస్కోలోని వ్యూంకోవ్ ఎయిర్ పోర్టుకు వెళ్లేవని, అక్కడ రష్యా బ్యాంకుల్లో నగదు జమ చేసేవారని పేర్కొన్నారు. ఇలా రష్యా బ్యాంకుల్లో ఒక్కసారిగా భారీ మొత్తాల్లో విదేశీ మారకద్రవ్యం డిపాజిట్లపై అమెరికా స్పందించింది. వీటిపై ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఈ నిధులను హెజ్‌బొల్లా, ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కోర్ వంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

