Home Page SliderInternational

‘ఉక్రెయిన్‌తో న్యూక్లియర్ వార్‌కి ‘సై’…పుతిన్ కీలక నిర్ణయం

రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు కీలక అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన డాక్యుమెంట్‌పై సంతకం చేయడం బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయన్ యుద్ధం మొదలై వెయ్యి రోజులైనా పరస్పర దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు న్యూక్లియర్ వార్‌కి పచ్చజెండా ఊపినట్లేనని ప్రపంచవ్యాప్తంగా శాంతికాముకులు భయపడుతున్నారు. తమ భారీ క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు అమెరికా, ఉక్రెయిన్‌కు అనుమతించడంతో రష్యా కూడా ఈ నిర్ణయం తీసుకుంది. అణ్వాయుధాలు కలిగి ఉన్న ఏ దేశమైనా ఉక్రెయిన్‌కు తమ ఆయుధాలు అందిస్తే దానిని వారు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావిస్తామని పుతిన్ హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నాటో, పశ్చిమ దేశాలు, అమెరికా ఈ యుద్ధంలో కలుగజేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.