గర్భం దాల్చడంతో ట్యాబ్లెట్స్ మింగి…చివరకు!
అధిక ట్యాబ్లెట్లు మింగి ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్సీ హాస్టల్లో విద్యార్థిని గర్భం దాల్చడం తీవ్ర కలకలం సృష్టించింది. పిడుగురాళ్ల అంజిరెడ్డి నర్సింగ్ కాలేజీలో GNM మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని… గర్భాన్ని పోగొట్టుకునేందుకు అధిక సంఖ్యలో గర్భనియంత్రణ మాత్రలు మింగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. హాస్టల్ సిబ్బందికి విషయం తెలియడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రక్త స్రావం అధికంగా అవడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ తీసుకెళ్లినట్లు తెలిపారు.పోలీసులు హాస్టల్‌కి చేరుకుని పరిశీలించారు.హాస్టల్ అధికారులు,సిబ్బందిని విచారించారు. కేసు నమోదు చేసుకున్నారు.

